రవితేజ సినిమా కోసం కేజీఎఫ్‌ ఫైట్‌ మాస్టర్లు - kgf fight master anbariv for ravi teja khiladi
close
Published : 24/12/2020 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రవితేజ సినిమా కోసం కేజీఎఫ్‌ ఫైట్‌ మాస్టర్లు

హైదరాబాద్‌: తెలుగు సినిమా పోరాట ఘట్టాల ప్రస్తావన వచ్చిందంటే రామ్‌ - లక్ష్మణ్‌ ద్వయం పేరు  వినిపించక మానదు. ఈ కవల సోదరులు  దక్షిణాది చిత్రసీమపై తమదైన ముద్రవేశారు. అచ్చం వీరిలాగే తమిళనాట మరో కవల సోదర ద్వయం ప్రతిభ చాటుతోంది. వాళ్లే... అన్బు - అరివు. ‘అన్బరివ్‌’ పేరుతో ప్రాచుర్యం పొందిన ఈ ఇద్దరూ ‘ఖైదీ’, ‘కె.జి.ఎఫ్‌’ చిత్రాలతో తమ సత్తాని చాటారు. సినీ యాక్షన్‌ ఘట్టాలపై తమదైన ముద్ర వేస్తున్నారు.

రవితేజ ‘ఖిలాడి’ కోసం ఈ రెండు సోదర ద్వయాలు యాక్షన్‌ ఘట్టాల్ని సమకూరుస్తున్నాయి. ఆ విషయాన్ని చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. రవితేజ కథానాయకుడిగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖిలాడి’. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జయంతీలాల్‌ గడ సమర్పిస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి ‘ప్లే స్మార్ట్‌....’ అనేది ఉపశీర్షిక. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి కథానాయికలు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక జైలు సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అన్బు -  అరివు నేతృత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, నలుగురు ప్రధానమైన ఫైట్‌ మాస్టర్లు పనిచేస్తుండడంతో మా చిత్రం గొప్ప యాక్షన్‌ అనుభూతిని పంచుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని