‘ఖిలాడి’ పోరాటం! - khiladi movie update
close
Published : 24/03/2021 21:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఖిలాడి’ పోరాటం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాస్‌ మహారాజ్‌ రవితేజ ‘క్రాక్‌’ బ్లాక్‌బస్టర్‌తో మంచి జోరుమీదున్నారు. అదే ఊపులో రమేశ్‌వర్మ డైరెక్షన్‌లో ‘ఖిలాడీ’చిత్రాన్ని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రబృందం  ఇటలీలో పోరాట ఘట్టాలను తెరకెక్కిచే పనిలో ఉంది. అందుకు సంబంధించిన ఒక యాక్షన్‌ ఫోటోను ట్విటర్‌లో పంచకున్నారు. రవితేజ వీరోచితంగా బైక్‌రైడ్‌ చేస్తున్న షాట్‌ కనిపిస్తోంది. ఈ నెలాఖరుకు ఇటలీ షెడ్యూల్‌ పూర్తవుతుందని వెల్లడించారు. ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌ రవితేజ ఎనర్జీ ఏ లెవెల్లో ఉండబోతుందో చూపిస్తుంది. మే 28న ఈ చిత్రం ధియేటర్లలో సందడి చేయనుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని