2022లో ఖుషీకపూర్‌ తెరంగేట్రం! - khushi kapoor pursues an acting course in us
close
Published : 30/01/2021 20:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2022లో ఖుషీకపూర్‌ తెరంగేట్రం!

మంబయి: అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీకపూర్‌  తెరంగేట్రానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఆమెను వెండితెరకు  పరిచయం చేయడానికి కరణ్‌జోహర్‌ వంటి బడా    నిర్మాతలు ఇప్పటికే బోనీకపూర్‌ను కలిశారని తెలుస్తోంది. అయితే ఆమె సినీరంగ ప్రవేశానికి అంత తొందర   పడటం లేదని బోనీకపూర్‌ అన్నట్లు సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి.

ప్రస్తుతం ఖుషీకపూర్‌ న్యూయార్క్‌లోని లీ స్టార్స్‌ బర్గ్‌ థియేటర్‌ అండ్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందుతోంది. ఇది 2021 ద్వితీయార్ధంలో పూర్తవుతుందని, ఆ శిక్షణ తర్వాత సినిమాల గురించి ఆలోచిస్తుందని చెబుతున్నారు. 2022లో ఆమె తెరపై కన్పించనుందని బాలీవుడ్‌ వర్గాలు వివరించాయి. శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి ‘గుంజన్‌ సక్సేనా’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం ఈమె కరణ్‌జోహార్‌ తీస్తున్న ‘తాహ్త’, ‘దోస్తానా-2’, ‘గుడ్‌లక్‌ జర్నీ’ చిత్రాలతో బిజీగా ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని