ఎన్టీఆర్‌ సరసన కియారా? - kiara opposite ntr
close
Published : 15/04/2021 14:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ సరసన కియారా?

ఇంటర్నెట్‌ డెస్క్: 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేస్తున్నారు. ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో ఎన్‌.టి.ఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించే ఈ చిత్రంలో కథానాయికగా కియారా అడ్వాణీని తీసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కియారా తెలుగులో ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో కథానాయికగా అలరించింది. ‘కబీర్‌ సింగ్‌’ చిత్రం తర్వాత బాలీవుడ్‌లో ఆమెకి మంచి క్రేజ్‌ వచ్చింది. ప్రస్తుతం కియారా హిందీ‌లో కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి ‘భూల్‌ భులయ్యా-2’, వరుణ్‌ ధావన్‌తో రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతున్న ‘జగ్‌ జుగ్‌ జియో’ చిత్రాల్లో నటిస్తోంది.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని