సుదీప్‌కు ‘బూర్జ్‌ ఖలీఫా’ అరుదైన గౌరవం! - kichha sudeep honored vikrantrona on burjkhalifa
close
Published : 01/02/2021 14:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుదీప్‌కు ‘బూర్జ్‌ ఖలీఫా’ అరుదైన గౌరవం!

దుబాయ్‌: కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌కు భారతీయ సినీ రంగంలో విలక్షణ నటుడిగా పేరుంది. తాజాగా ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫా భవనంపై సుదీప్‌కు ఆరుదైన గౌరవం దక్కింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘విక్రాంత్‌ రోనా’ టైటిల్‌ లోగోను, టీజర్‌ను లేజర్‌ షోతో ఆ భవనంపై ప్రదర్శించారు. ప్రపంచానికి ఓ కొత్త హీరో దొరికాడంటూ రాసుకొచ్చారు.

ప్రపంచంలోని అత్యంత ప్రభావితమైన వ్యక్తులు, ముఖ్య సంఘటనలు మాత్రమే దుబాయ్ బూర్జ్ ఖలీఫాపై లేజర్ షో వేస్తారు. భారతీయ నటుల్లో షారుఖ్‌ తర్వాత సుదీప్‌కే ఈ ఘనత దక్కింది. దీంతో సుదీప్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన నటుడికి సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రంలో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుదీప్‌.. తెలుగు చిత్రాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉంటారు.

ఇవీ చదవండి!

‘రెడ్‌’ ఐటమ్‌ సాంగ్‌ వీడియో వచ్చేసింది

‘కొండవీటి రాజా’కు 35 ఏళ్లు!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని