జాగ్రత్తలు తీసుకోవడమే ఏకైక మార్గం: కిషన్‌రెడ్డి - kishan reddy urged people to take care amid corona
close
Published : 27/07/2020 23:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాగ్రత్తలు తీసుకోవడమే ఏకైక మార్గం: కిషన్‌రెడ్డి

దిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా. కరోనా విషయంలో ప్రధాని మోదీ సూచించిన విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. సామాజిక దూరం పాటించండి. మాస్కు ధరించండి. ఇళ్ల నుంచి వీలైనంత వరకు బయటకు రావొద్దు. గుంపులుగా తిరగొద్దు. కరోనా వ్యాధికి కచ్చితమైన మందులు ఇంకా రాలేదు. అందరూ జాగ్రత్తలు తీసుకోవడమే ఏకైక మార్గం. కరోనా కేసులు పెరగడంతో దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వేళ ప్రభుత్వానికి సహకరించాలి. కరోనాను ఓడించి మనం ప్రాణాలతో నిలుద్దాం.. దేశాన్ని, ప్రపంచ మానవాళిని రక్షిద్దాం’’అని కిషన్‌రెడ్డి చెప్పారు. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని