కోహ్లీకి సాయం చేసిన కిషన్‌ ఇన్నింగ్స్‌ - kishans aggressive batting helped kohli play his natural game says atherton
close
Published : 15/03/2021 20:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీకి సాయం చేసిన కిషన్‌ ఇన్నింగ్స్‌

లండన్‌: అరంగేట్రం కుర్రాడు ఇషాన్‌ కిషన్ అదరగొట్టడంతో ఒత్తిడిలో ఉన్న విరాట్‌ కోహ్లీ స్వేచ్ఛగా ఆడగలిగాడని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ ఆర్థర్‌టన్‌ అన్నాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ సహజశైలిలో ఆడేందుకు కిషన్‌ ఇన్నింగ్స్‌ ఉపయోగపడిందని పేర్కొన్నాడు. మూడో టీ20కి ముందు ఆయన మీడియాతో మాట్లాడాడు.

రెండో టీ20లో అరంగేట్రం చేసిన కిషన్‌ 32 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. విరాట్‌ (49 బంతుల్లో 73*)తో కలిసి రెండో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఛేదనలో దూకుడుగా ఆడాడు. టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కిషన్‌ దూకుడుగా ఆడటంతో కోహ్లీపై ఒత్తిడి తగ్గింది!

‘తొలి మ్యాచులో విరాట్‌ కాస్త ఒత్తిడికి గురయ్యాడు. ఎందుకంటే టీమ్‌ఇండియా దూకుడుగా పరుగులు చేస్తుందని అతడు మీడియాలో చెప్పాడు. మొదటి మ్యాచులో భారత లైనప్‌లో ఇబ్బంది ఏమిటంటే టాప్‌ ఆర్డర్‌లో ఒకే తరహా ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. దాంతో కోహ్లీ ఒత్తిడికి లోనయ్యాడు. మరింత దూకుడుగా ఆడటం అతడి సహజశైలి కాదు’ అని ఆర్థర్‌టన్‌ అన్నాడు.

‘కోహ్లీ గొప్ప ఆటగాడు. చాలా వేగంగా పరుగులు చేస్తాడు. కానీ అతడు రిషభ్‌, కిషన్‌ తరహా ఆటగాడు కాదు. వారి బ్యాటింగ్ శైలి భిన్నం. అందుకే ఆ కుర్రాడొచ్చి ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడటంతో కోహ్లీపై బరువు తొలగిపోయింది. తన సహజశైలిలో ఆడేందుకు ఉపయోగపడింది. తొలి మ్యాచులో ఔటైనప్పుడు ఆడిన షాట్‌ అతడు సాధారణంగా ఆడేది కాదు. కొత్తగా చేద్దామనుకొనే సరికి ఇబ్బంది పడ్డాడు. సంప్రదాయ షాట్లు ఆడటమే అతడి శైలి. అలా ఆడినా అతడు వేగంగా పరుగులు చేయగలడు. ఇదే కోహ్లీ అసలైన ప్రదర్శన అని నా విశ్వాసం’ అని ఆర్థర్‌టన్‌ తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని