KL Rahul: అతియాతో మరింత చనువుగా..! - kl rahul Athiya shetty first time acts in a ad
close
Updated : 17/06/2021 11:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

KL Rahul: అతియాతో మరింత చనువుగా..!

తొలిసారి కలిసి నటించిన రాహుల్‌, అతియా

ముంబయి: టీమ్‌ఇండియా స్ట్రోక్‌ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అతియా శెట్టి ప్రేమ పక్షులని ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని మరింత బలపరిచే సన్నివేశం మరొకటి చోటుచేసుకుంది. రాహుల్‌, అతియా కలిసి తొలిసారి ఓ ప్రకటనలో నటించారు. వారిద్దరూ ఎంతో సరదాగా.. సన్నిహితంగా గడిపారు. ‘నుమి ప్యారిస్’ విలాసవంతమైన కళ్లద్దాల యాడ్‌లో వీరిద్దరూ హొయలు పోయారు. ఇదే అదనుగా సునిల్‌ శెట్టి తెరమీదకు వచ్చాడు. ‘నిజంగా అద్భుతం! అతియా, రాహుల్‌.. మీరిద్దరూ ఈ సరికొత్త అవతారంలో మతి పోగొట్టారు!!!’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. దాంతో అతడి గారాల పట్టి అతియా సైతం తండ్రి వ్యాఖ్యకు వెంటనే స్పందించింది.

రాహుల్‌, అతియా అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఒకరి గురించి మరొకరు పోస్టులు పెడుతుంటారు. దాంతో వీరు ప్రేమించుకుంటున్నారని చాలామంది భావిస్తున్నారు. అయితే ప్రేమలో ఉన్నారా? లేరా? అన్న విషయంపై మాత్రం వీరిద్దరూ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం రాహుల్‌ ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడుతుండగా అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్‌గా తేల్చారు. దాంతో వెంటనే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. త్వరగా కోలుకొని ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. ఐసీసీ ప్రపంచకప్‌ జట్టులో అతడికి చోటు దక్కలేదు. బహుశా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసులో అతడికి అవకాశాలు ఇవ్వొచ్చు.






మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని