బౌండరీ లైన్‌పై రాహుల్‌ సూపర్‌మ్యాన్‌ షో..  - kl rahul became as super man in the first t20 against england
close
Updated : 13/03/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బౌండరీ లైన్‌పై రాహుల్‌ సూపర్‌మ్యాన్‌ షో.. 

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ చేసిన ఓ విన్యాసం అభిమానులను కట్టిపడేసింది. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో అక్షర్‌ పటేల్‌ అయిదో ఓవర్‌ బౌలింగ్‌ చేయగా తొలి బంతికి బట్లర్‌ కొట్టిన భారీ షాట్‌ను రాహుల్‌ బౌండరీ దగ్గర ఎగురుతూ గాల్లో క్యాచ్‌ అందుకున్నాడు. అయితే.. అతడు నియంత్రణ కోల్పోయి బౌండరీ అవతలకి పడిపోయాడు. కానీ పడిపోయే ముందే బంతిని మైదానంలోకి విసిరేసి జట్టుకు నాలుగు పరుగులు ఆదా చేశాడు. కచ్చితంగా సిక్స్‌ అనుకున్న షాట్‌ను రాహుల్‌ ఆపిన తీరుకు అభిమానులు ముగ్ధులైపోయారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

కాగా, ఇంగ్లాండ్‌ తొలి టీ20లో విజయం సాధించి టీమ్ఇండియాకు గట్టి షాకిచ్చింది. భారత టాప్‌ ఆర్డర్‌ ఆదిలోనే కుప్పకూలగా.. శ్రేయస్‌ అయ్యర్‌(67; 48 బంతుల్లో 8x4, 1x6) ఒక్కడే బాధ్యతాయుతంగా ఆడాడు. అతడికి పంత్‌(21), హార్దిక్‌ పాండ్య(19) కాస్త సహకరించారు. దీంతో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. జేసన్‌రాయ్‌(49; 32 బంతుల్లో 4x4, 3x6), జాస్‌ బట్లర్‌(28; 24 బంతుల్లో 2x4, 1x6) ఔటైనా డేవిడ్‌ మలన్‌(24), జానీ బెయిర్‌స్టో(26) మరో వికెట్‌ పడకుండా 15.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని