Instagram: ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నారా..? అయితే ఈ ఫీచర్ మీ కోసమే! - know how to find required audio clip for instagram reels
close
Published : 14/09/2021 14:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Instagram: ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నారా..? అయితే ఈ ఫీచర్ మీ కోసమే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువతరం ఎక్కువగా ఉపయోగించే యాప్‌లలో ఇన్‌స్టాగ్రాం ముందు వరుసలో ఉంటుంది. ఇందులో ఫొటో, వీడియో షేరింగ్‌తోపాటు స్టోరీస్‌, రీల్స్‌ వంటి ఫీచర్స్‌ ఉండటంతో ఈ యాప్‌ను ఉపయోగించేందుకు యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఎక్కువ మంది యువతను ఆకర్షించేందుకు ఇన్‌స్టాగ్రాం ఆడియో కంటెంట్‌ సెర్చ్‌ ట్యాబ్‌ను తీసుకొచ్చింది. దీంతో స్టోరీస్‌, రీల్స్ రూపొందించే యూజర్స్ తమ వీడియోలను అనువైన ఆడియోను సులువుగా ఇందులో వెతకొచ్చు. ఇంతకీ ఆడియో సెర్చ్‌ ట్యాబ్ ఎలా పనిచేస్తుంది? దాంతో ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం..

* ఈ ఆడియో సెర్చ్ టూల్ సాయంతో యూజర్ రూపొందించే వీడియోకు కావాల్సిన ఆడియోను కీవర్డ్స్ సాయంతో ఇన్‌స్టాగ్రాంలోనే వెతకొచ్చు. మీ కీవర్డ్‌కి దగ్గరగా ఉన్న పాటల జాబితా కనిపిస్తుంది. వాటిపై క్లిక్ చేస్తే ఆ పాటకు సంబంధించిన శాంపిల్‌ వినిపిస్తుంది. అది మీకు నచ్చితే ఆ పాటను మీ రీల్స్‌కి ఉపయోగించుకోవచ్చు.

* హై-క్వాలిటీ రీల్స్ రూపొందించాలనుకునే యూజర్స్‌కి ఈ ఆడియో సెర్చ్ టూల్ ఎంతో ఉపయోగపడుతుందని పలువురు ఇన్‌స్టాగ్రాం యూజర్స్ అభిప్రాయపడుతున్నారు. టిక్‌టాక్ సౌండ్ ట్యాబ్ తరహాలోనే ఇన్‌స్టాగ్రాం ఆడియో సెర్చ్ ఫీచర్ కూడా పనిచేస్తుంది. దీని కోసం ఇన్‌స్టాగ్రాం యాప్ ఓపెన్ చేసి కుడివైపు కింద ఉన్న సెర్చ్‌ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.

* సెర్చ్ పేజ్‌ ఓపెన్ అయిన తర్వాత అందులో మీకు టాప్‌, అకౌంట్స్‌, ఆడియో, ట్యాగ్స్‌, ప్లేసెస్ పేరుతో వేర్వేరు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఆడియో ఆప్షన్‌పై క్లిక్ చేసి మీకు కావాల్సిన పాట పేరు లేదా ఆర్టిస్ట్‌ పేరు టైప్ చేస్తే దానికి సంబంధించిన ఆడియో క్లిప్ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే యూజ్‌ ఆడియో ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేసి మీరు రీల్స్‌ని రూపొందిచుకోవచ్చు. 

గతంలో కేవలం ఫొటో షేరింగ్ యాప్‌లా ఉన్న ఇన్‌స్టాగ్రాంలో ఎన్నో రకాల కొత్త ఫీచర్లు యూజర్స్‌కి అందుబాటులో ఉన్నాయి. అందుకే రీల్స్‌, వీడియోల సాయంతో ఎంతో మంది యువత కంటెంట్‌ను రూపొందిస్తూ ఆదాయం పొందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్‌స్టాగ్రాంలో వీడియో కంటెంట్ రూపొందించే వారి కోసం మరిన్ని కొత్త ఫీచర్లు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని