భువీకి ‘మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌’ ఇవ్వరా: కోహ్లీ - kohli surprised at shardul not getting man of the match and bhuvi missing man of the series
close
Published : 29/03/2021 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భువీకి ‘మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌’ ఇవ్వరా: కోహ్లీ

క్యాచులు వదిలేస్తే మూల్యం చెల్లించాల్సిందే..

పుణె: నిలకడగా రాణించిన భువనేశ్వర్‌ కుమార్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌, ఆఖరి వన్డేలో వికెట్లు తీసిన శార్దూల్‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ రాకపోవడం ఆశ్చర్యం కలిగించిందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో వారిద్దరూ అదరగొట్టారని ప్రశంసించాడు. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్నాక అతడు మీడియాతో మాట్లాడాడు.

ఆఖరి వన్డేలో ఛేదనలో 83 బంతుల్లో 95 పరుగులతో అజేయంగా నిలిచిన సామ్‌ కరన్‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ ఇచ్చారు. సిరీస్‌ మొత్తంలో 219 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టోను మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌కు ఎంపిక చేశారు. భువీ 3 వన్డేల్లో 22.50 సగటు, 4.65 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అందుకే కోహ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చివరి మ్యాచులో ఫీల్డింగ్‌ మాత్రం నిరాశపరిచిందని వెల్లడించాడు. ఆటగాళ్లు 4 క్యాచులు వదిలేయడం గమనార్హం.

‘క్యాచులు జారవిడిచినందుకు ఆటగాళ్లు నిరాశపడతారు. బాధపడుతూ క్యాచులు వదిలేస్తే కొన్నిసార్లు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా ఆటలో భాగమే. మా దేహభాష, తీవ్రత మాత్రం అద్భుతం. చివరికి మేం విజయం సాధించాం. ఏదేమైనా టాప్‌-2 జట్లు పోటీపడితే ఇలాంటి గొప్ప మ్యాచులే ఉంటాయి. ఇంగ్లాండ్‌ అంత తేలిగ్గా వదలదని మాకు తెలుసు. ఇక సామ్‌ కరన్‌ తిరుగులేని ఇన్నింగ్స్‌ ఆడాడు’ అని కోహ్లీ అన్నాడు.

‘ఏదేమైనా మా బౌలర్లు వికెట్లు తీశారు. నటరాజన్‌, హార్దిక్‌ తిరిగి పుంజుకున్నారు. ప్రసిద్ధ్‌, కృనాల్‌ ఆకట్టుకున్నారు. త్వరగా వికెట్లు పడ్డా డెత్‌ ఓవర్లలో మా బ్యాటింగ్‌ చాలా బాగుంది. టాప్-3 ఆటగాళ్లు శతకాలు చేసుకుంటే స్కోరు 370 లేదా 380కి చేరేది. ప్రపంచ విజేతపై సాధించిన ఈ విజయం ఎంతో మధురమైంది. ఈ సీజన్‌, సిరీసులు మజా ఇచ్చాయి. గొప్పగా ముగించాం. బుడగల్లో ఆడటం కష్టంగా ఉంది కాబట్టి షెడ్యూళ్లు జాగ్రత్త చేయాలి. ఎందుకంటే ప్రతి ఆటగాడి మానసిక సామర్థ్యం ఒకేలా ఉండదు. ఐపీఎల్‌ కోసం ఎదురుచూస్తున్నాం’ అని కోహ్లీ తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని