కొంటె నవ్వే ఇలా.. చంపుతుంటే ఎలా - kola kalla song from varudu kavalenu
close
Published : 14/02/2021 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొంటె నవ్వే ఇలా.. చంపుతుంటే ఎలా

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: నాగశౌర్య, రీతూవర్మ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ‘కోలా కళ్లే ఇలా’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. ఇటీవలే విడుదలైన ఈ పాట ప్రోమో విశేష ఆదరణ పొందింది. తాజాగా వచ్చిన లిరికల్‌ వీడియో సైతం  సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటను సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు.

పీడీవీ ప్రసాద్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు: గణేశ్‌ కుమార్‌ రావూరి, కూర్పు: నవీన్‌ నూలి, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రం మే లో విడుదల కానుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు సమకూర్చిన ఈ మెలొడీని మీరూ వినేయండి.

ఇదీ చదవండి..

బిగ్‌బాస్‌ ఫేం మోనల్‌-అఖిల్‌ కొత్త సినిమా ఇదే!

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని