కోల్‌కతా ఘన విజయం - kolkata beats punjab kings
close
Updated : 26/04/2021 23:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోల్‌కతా ఘన విజయం

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ కింగ్స్‌ నిర్దేశించిన 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 16.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్‌ త్రిపాఠి(41; 32 బంతుల్లో 7x4), ఇయాన్‌ మోర్గాన్‌(47 నాటౌట్‌; 40 బంతుల్లో 4x4, 2x6) కీలకంగా ఆడారు. 17 పరుగులకే  నితీశ్‌రాణా(0), శుభ్‌మన్‌గిల్‌(9), సునీల్‌ నరైన్‌(0) పెవిలియన్‌ చేరిన దశలో త్రిపాఠి, మోర్గాన్‌ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 48 బంతుల్లో 66 పరుగులు జోడించి కోల్‌కతాను తిరిగి రేసులో నిలిపారు. అయితే రాహుల్‌ ధాటిగా ఆడే క్రమంలో దీపక్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. అప్పటికి జట్టు స్కోర్‌ 83/4గా నమోదైంది. అనంతరం రసెల్‌(10) క్రీజులోకి వచ్చినా స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. అప్పటికి కోల్‌కతా విజయం ఖాయమైంది. చివర్లో దినేశ్‌కార్తీక్‌(12నాటౌట్‌; 6 బంతుల్లో 2x4)తో జోడీ కట్టిన మోర్గాన్‌ కోల్‌కతాకు రెండో విజయాన్ని అందించాడు. పంజాబ్‌ బౌలర్లలో హెన్రిక్స్‌, షమి, అర్ష్‌దీప్‌, దీపక్‌ హుడా తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (31; 34 బంతుల్లో 1x4, 2x6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆ జట్టు ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ భారీ స్కోర్‌ సాధించే దిశగా సాగలేదు. ఈ క్రమంలోనే చివర్లో జోర్డాన్‌ (30; 18 బంతుల్లో 1x4, 3x6) ధాటిగా ఆడడంతో జట్టు స్కోర్‌ 100 పరుగులైనా దాటగలిగింది. లేకపోతే ఆ మాత్రం స్కోర్‌ కూడా వచ్చేది కాదు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిద్ధ్‌ 3, నరైన్‌, కమిన్స్‌ 2 వికెట్లు తీయగా శివమ్‌ మావి, చక్రవర్తి చెరో వికెట్‌ పడగొట్టారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని