close
Published : 27/02/2021 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కోలు కోలుమ్మా.. కోలు కోలు నా సామి.. మనసే మేలు కొని చూసే.. కలలో నిండిన వాడే.. కనుల ముందుట ఉంటే నూరేళ్లు నిదుర రాదులే’ అంటూ తనకు కాబోయే వాడి గురించి పాట పాడుతూ ఫిదా చేసింది సాయి పల్లవి. రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్‌ బొబ్బిలి స్వరాలందిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలోని ‘కోలు కోలు’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ విడుదల చేశారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, దివ్య మాలికా, సురేశ్‌ బొబ్బిలి ఆలపించారు.

దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఒక విభిన్నమైన  కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటి వరకు కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు’’ అని చిత్ర బృందం ఇప్పటికే తెలియజేసింది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పిస్తున్న ఈ చిత్రన్ని, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని