Covid Vaccination: అక్కడ పెద్దలకు 100% టీకా! - komic in hp completes 100per covid vaccination
close
Updated : 20/05/2021 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid Vaccination: అక్కడ పెద్దలకు 100% టీకా!

అత్యంత ఎత్తైన ప్రదేశంలోని కొమిక్ గ్రామంలో..

దిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న కొమిక్ గ్రామంలో 45ఏళ్లు పైబడిన వారందరికి ఉచితంగా కరోనా టీకా అందింది. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహల్, స్పితి జిల్లాలో ఉన్న ఈ వయస్సు గ్రూపులోని అర్హులకు వంద శాతం టీకాలు అందినట్లు స్థానిక అధికారులు చెప్తున్నారు. 

ఈ కొమిక్ గ్రామం.. సముద్రమట్టానికి 15,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. కొవిడ్ నిబంధనలు కఠినంగా పాటిస్తున్న అక్కడి ప్రజలు..వ్యవసాయ పనుల నిమిత్తం మాత్రమే బయటకు వస్తారట. చిన్నారులు, వృద్ధులు ఇంటికే పరిమితమయ్యారని స్థానికుడొకరు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. దాని కంటే ముందే అక్కడి ప్రజలు టీకా తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. వారు తమ రెండో డోసును కూడా పూర్తి చేయడం సంతోషంగా ఉందని స్థానిక వైద్యాధికారి తెలిపారు. ఎత్తైన ప్రదేశంలో టీకా పంపిణీ నిమిత్తం అక్కడ ఒక వైద్య బృందం పర్యటిస్తోంది. కొమిక్, హిక్కిం వంటి గ్రామాలున్న లాంగ్జా పంచాయతీలో 60 ఏళ్లు పైబడిన వారు 101 మంది ఉండగా.. 44 నుంచి 60 ఏళ్ల వయస్సు వారు 150 మంది. మొత్తం జనాభా 330. ఇందులో 44 ఏళ్లు పైబడిన వారందరికి రెండు డోసుల టీకా అందిందని అధికారులు చెప్తున్నారు. వీరి తర్వాత యువత కూడా టీకా వేయించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. భౌగోళికంగా ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో వారికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం వల్ల వారు టీకా కోసం కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్ కాలేపోతున్నారు. వారికోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను హిమాచల్ ప్రభుత్వం మినహాయించింది. ఈ ఎత్తైన ప్రదేశంలోని కాజా బ్లాక్‌లో 13 పంచాయతీలు ఉన్నాయి. ఆ ప్రాంతం టీకా కార్యక్రమంలో ముందుందని అధికారులు చెప్తున్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని