
తాజా వార్తలు
ఇంతలా ఆదరిస్తారని ఊహించలేదు: రవితేజ
విశాఖపట్నంలో ‘క్రాక్’ విజయోత్సవ కార్యక్రమం
విశాఖపట్నం: మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. ‘డాన్‌శీను’, ‘బలుపు’ తర్వాత ఇప్పుడు మరోసారి వాళ్లిద్దరూ కలిసి పనిచేసిన ‘క్రాక్’ జనవరి 9న విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ నటించింది. సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. సంగీతం దర్శకుడు తమన్. బి.మధు నిర్మాత. విశాఖపట్నంలో ఈ చిత్రబృందం విజయోత్సవ సభలో రవితేజ మాట్లాడారు.
‘‘కరోనా లాక్డౌన్ తర్వాత కూడా సినిమా చూడటానికి జనం వస్తారని మాకు నమ్మకం ఉంది. కానీ.. ఇంతా ఆదరిస్తారని ఊహించలేదు. గతంలో థియేటర్లకు ఎలా వచ్చేవారో.. ఈ సినిమాకు అలాగే వచ్చారు. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మంచి కిక్ ఇచ్చారు. కెమెరామన్ విష్ణు చాలా అద్భుతంగా పనిచేశాడు. ఆయనతో మళ్లీమళ్లీ చేయాలని కోరుకుంటున్నాను. తమన్ గురించి చెప్పాలంటే.. ఆయనతో చాలా సినిమాలు చేశాను. ఎంతమంచి సంగీతం ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైట్ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్ కెరీర్, నా కెరీర్ ఒకేసారి మొదలయ్యాయి. వాళ్లిద్దరూ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. అలీ.. నేను చెన్నై నుంచి స్నేహితులం. ఇద్దరం కలిసి దాదాపు 50 సినిమాల్లో నటించాం. వరలక్ష్మి సీరియస్ పాత్రలు చేస్తుంది. కానీ.. సెట్లో మాత్రం అందరినీ నవ్విస్తూ ఉంటుంది. చాలా సరదా మనిషి. బుర్రా సాయిమాధవ్ మంచి డైలాగ్స్ రాశారు. సముద్రఖని.. కటారి కృష్ణగా చాలా బాగా చేశారు. ఆయనో డైరెక్టర్.. నటుడు.. విలన్.. అన్ని విషయాల్లోనూ పర్ఫక్ట్. రచ్చరవి ఇక్కడి నుంచి బిజీగా అవుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. శృతిహాసన్ కూడా బాగా చేసింది. సినిమాను ఆదరించిన అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు’’ అని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు డైరెక్టర్ గోపీచంద్ మలినేని, నటీనటులు, చిత్రబృందం సభ్యులు మాట్లాడారు.
ఇదీ చదవండి..
‘మాస్టర్’ డైరెక్టర్ భావోద్వేగం!
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- ఇక చాలు
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
