ఆ ప్రచారానికి చెక్‌పెట్టిన రవితేజ దర్శకుడు - krack in Theaters only clarifiy Gopichand malineni
close
Published : 15/08/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ప్రచారానికి చెక్‌పెట్టిన రవితేజ దర్శకుడు

హైదరాబాద్‌: రవితేజ చిత్రమంటే చూస్తున్నంత సేపు వచ్చే మజాయే వేరు. కామెడీ టైమింగ్‌ మాత్రమే కాదు, మాస్‌ను మెప్పించే అంశాలు ఆయన చిత్రాల్లో పుష్కలంగా ఉంటాయి. అయితే, రవితేజ నుంచి అలాంటి చిత్రం వచ్చి చాలా రోజులైంది.

ఈ నేపథ్యంలో హిట్‌ కాంబినేషన్‌గా పేరు పొందిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. శ్రుతి హాసన్‌ కథానాయిక. చిత్రీకరణ సహా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 8న విడుదల కావల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడటంతో విడుదల వాయిదా వేశారు.  

తాజాగా భాషతో సంబంధం లేకుండా సినిమాలన్నీ ఓటీటీ బాటపడుతున్న వేళ ఈ చిత్రం కూడా అలాగే విడుదలకానుందని ప్రచారం మొదలైంది. దీంతో దర్శక-నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. ఈ వార్తలను దర్శకుడు గోపిచంద్‌ మలినేని ఖండించారు. తన ‘క్రాక్ ’చిత్రాన్ని ఎప్పటికైనా థియేటర్ లోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని