క్రాకెక్కిస్తున్న ‘మాస్‌ బిర్యానీ’ సాంగ్‌ - krack mass biryani song by raviteja shruthi haasan
close
Published : 05/01/2021 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రాకెక్కిస్తున్న ‘మాస్‌ బిర్యానీ’ సాంగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ సంక్రాంతి పండగకు మంచి మాస్‌ మాసాలా మూవీ బిర్యానీ రుచి చూపించేలా ఉన్నారు ‘క్రాక్‌’చిత్ర బృందం. ఈ చిత్రంలోని ‘‘ఓసీ నా క్లాసు కల్యాణి..పెట్టవే మాసు బిర్యానీ’’ అంటూ అదిరిపోయే సెట్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను సోమవారం విడుదల చేశారు. మాస్‌ మహారాజ్‌ రవితేజ, క్యూటీ శృతి హాసన్‌తో కలిసి మాస్‌ స్టెప్పులు ఇరగదీసీనట్టు ఈ వీడియోలో అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలయిన ట్రైలర్‌లో రవితేజ మార్కు మాస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఉన్నట్టు సంకేతాలు కనిపించాయి. రాహుల్‌ నంబియార్‌, సాహితి చాగంటి ఆలపించిన ఈ మాస్‌బీట్‌కు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. దర్శకుడు గోపిచంద్‌ మలినేని, రవితేజ కాంబోలో వచ్చిన డాన్‌శీను, బలుపు చిత్రాలు హిట్లుగా నిలవడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఇవీ చదవండి!

‘మై నే ప్యార్‌కియా’లో నటించొద్దనుకున్నాను: భాగ్యశ్రీ

డబ్బింగ్‌ పనులు షురూ



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని