Kriti Sanon: ‘ఆది పురుష్’ కోసం సిద్ధ‌మ‌వుతున్నా - krithi sanon about adi purush
close
Published : 30/05/2021 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kriti Sanon: ‘ఆది పురుష్’ కోసం సిద్ధ‌మ‌వుతున్నా

ముంబ‌యి: లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ముంబ‌యిలోని త‌న ఇంట్లోనే ఆస్వాదిస్తోంది న‌టి కృతి స‌న‌న్‌. అలా అని స‌ర‌దాగా డ్యాన్సు చేస్తూనో, ఇష్ట‌మైన సినిమాలు చూస్తుంద‌నుకుంటే పొర‌పాటే. ఇటీవ‌ల త‌ను సంత‌కం చేసిన సినిమాల్లోని సంభాష‌ణ‌ల‌ని ప్రాక్టీస్ చేస్తోందట‌ కృతి. ప్ర‌స్తుతం కృతి చేతిలో ఏడు ప్రాజెక్టులున్నాయి. వాటిల్లో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతోన్న ‘ఆది పురుష్’ ఒక‌టి. ఇందులో శ్రీ రాముడిగా ప్ర‌భాస్, సీత‌గా కృతి క‌నిపించ‌నున్నారు. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా త‌దుప‌రి షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని, డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నాన‌ని తాజాగా ఓ ఇంట‌ర్వూలో తెలియజేసింది. మ‌రో చిత్రం ‘గ‌ణ్‌ప‌త్’ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది. ఈ క్లిష్ట స‌మ‌యంలో మ‌న‌మంతా ఒక‌టిగా నిల‌వాల‌ని, మ‌న‌కు సాయం చేసిన వారికి మ‌నం సాయం చేయాల‌ని అభిమానుల్ని కోరింది. ‘1 నేనొక్క‌డినే’  చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచయమైంది కృతి. మహేశ్ బాబు హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. త‌ర్వాత నాగ చైత‌న్య క‌థానాయ‌కుడిగా వ‌చ్చిన ‘దోచెయ్’  చిత్రంలో సంద‌డి చేసింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని