బెల్లంకొండ గణేష్‌ సరసన బేబమ్మ ? - krithi shetty bellamkonda ganesh for hindi movie vivah telugu remake
close
Published : 17/05/2021 20:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెల్లంకొండ గణేష్‌ సరసన బేబమ్మ ?

ఇంటర్నెట్ డెస్క్:  ప్రముఖ తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుల్లో సాయి శ్రీనివాస్‌ హీరోగా రాణిస్తున్నారు. ఆయన మరో కుమారుడు గణేష్‌ కూడా కథానాయకుడిగా పవన్‌ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌, అమృతరావు జంటగా నటించిన ‘వివాహ్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌ హక్కులను బెల్లంకొండ సురేష్‌ దక్కించుకున్నారు. అయితే ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్ హీరోగా ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి కథానాయికగా నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి వార్త బయటకు రాలేదు.

సూరజ్‌ బర్జాత్య దర్శకత్వం వహించిన ‘వివాహ్‌’ (2006) చిత్రం అప్పట్లో తెలుగులోనూ ‘పరిణయం’ పేరుతో అనువాదమైంది. బెల్లంకొండ కుటుంబం ఈ మధ్య కాలంలో ఇతర భాషల సినిమాలకు సంబంధించిన రీమేక్‌ హక్కులను సొంతం చేసుకుంటున్నారు. తెలుగులో హిట్టయిన సినిమాలను హిందీలోనూ రీమేక్‌ చేస్తున్నారు. ఇక కన్నడ భామ కృతి శెట్టి తొలి చిత్రం ‘ఉప్పెన’లో తన నటనతో ఆకట్టుకొని వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం కృతి నానితో కలిసి ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో  నటిస్తోంది. మరో హీరో సుధీర్‌బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని