ఈశ్వరా.. మేకింగ్‌ వీడియో చూశారా? - krithi shettys eswara making video
close
Published : 14/04/2021 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈశ్వరా.. మేకింగ్‌ వీడియో చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఉప్పెన’ చిత్రంలో తన హావభావాలతో అందరినీ ఆకట్టుకుంది కన్నడ చిన్నది కృతిశెట్టి. ఆ సినిమాలో ‘ఈశ్వరా.. పరమేశ్వరా..’ అనే పాటకు నాట్యం చేసే అవకాశం లేకపోయింది. దీంతో కృతి ప్రైవేటు ఆల్బమ్‌ విడుదల చేసి మరోసారి ఔరా అనిపించుకుంది. కొరియోగ్రఫర్‌ దీపికారెడ్డి ఈ పాటకు డ్యాన్స్‌ కంపోజ్‌ చేశారు. యూట్యూబ్‌లో ఈ వీడియోకు మంచి ఆదరణ లభించింది. తాజాగా..ఈ వీడియో మేకింగ్‌కు సంబంధించి మరో వీడియోను కృతిశెట్టి తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. కృతి ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పటికీ పదేళ్ల అనుభవం ఉన్న నటిలా కనిపిస్తోందని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆలస్యమెందుకు.. ఆ మేకింగ్‌ వీడియోను మీరూ చూసేయండి మరి..!

బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’లో వైష్ణవ్‌తేజ్‌కు జోడీగా కృతి తెలుగు తెరకు పరిచయమైంది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అంతేకాదు.. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడంలోనూ రికార్డులు సృష్టించింది. దీంతో తొలి సినిమాతోనే డైరెక్టర్‌తో పాటు హీరోహీరోయిన్లకు మంచిపేరు వచ్చింది. ఈ చిత్రంలో మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ఓ కీలకపాత్రలో కనిపించి అలరించారు. నవీన్‌ యార్నేని, రవిశంకర్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని