విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కృతి స‌న‌న్‌? - krithisanon with vijay devarakonda
close
Published : 16/05/2021 19:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కృతి స‌న‌న్‌?

ఇంట‌ర్నెట్ డెస్క్‌: విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న కృతి స‌న‌న్ న‌టించ‌నుందా? అవున‌నే వినిపిస్తోంది సినీ వ‌ర్గాల్లో. విజ‌య్ హీరోగా ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ చిత్రం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలోనే నాయిక‌గా కృతిని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట చిత్ర బృందం. విజ‌య్‌కి జోడీగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించని భామ అయితేనే సినిమాకి కొత్త‌ద‌నం వ‌స్తుంద‌ని భావించి ఆమెతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు. మ‌రోవైపు.. గ‌తంలో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘1 నేనొక్క‌డినే’ చిత్రంలో న‌టించింది కృతి. ఆమె న‌ట‌న‌కి ఫిదా అయిన సుకుమార్ ఈ ప్రాజెక్టుతో మ‌రో అవ‌కాశం ఇవ్వ‌బోతున్నారంటూ ప్ర‌చారం సాగుతోంది. అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న ‘ఆది పురుష్‌’ చిత్రంలో న‌టిస్తోంది కృతి. ఇందులో సీత పాత్ర పోషిస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లైగ‌ర్‌’ సినిమా చేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్‌.. ఈ చిత్రం పూర్త‌యిన త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే అవ‌కాశాలున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని