TS News: కావేటి పార్థివదేహానికి కేటీఆర్ నివాళి - ktr tribute to caveti
close
Updated : 15/06/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: కావేటి పార్థివదేహానికి కేటీఆర్ నివాళి

హైద‌రాబాద్‌: తెరాస సీనియ‌ర్ నేత కావేటి ల‌క్ష్మీనారాయ‌ణ మృతి ప‌ట్ల ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్ సంతాపం వ్య‌క్తం చేశారు. కూక‌ట్‌ప‌ల్లిలోని ల‌క్ష్మీనారాయ‌ణ నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంత‌రం కుటుంబ సభ్యుల‌ను మంత్రి ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీకి చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్, సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, ఎమ్మెల్సీలు న‌వీన్‌రావు, ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ల‌క్ష్మీనారాయ‌ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని