సుధా కొంగర దర్శకత్వంలో ప్రభాస్‌..? - lady director in plans of working with prabhas
close
Published : 10/05/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుధా కొంగర దర్శకత్వంలో ప్రభాస్‌..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాలతో ఒక్కసారిగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీని ఆకర్షించారు డైరెక్టర్‌ సుధా కొంగర. ఆమె గురించి ఒక వార్త ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో కలిసి ఆమె ఒక సినిమా తీయబోతున్నారట. ఇప్పటికే ఒక కథ కూడా ప్రభాస్‌కు వినిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్టు ప్రభాస్‌కు నచ్చడంతో ఆయన సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారట. అయితే, ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా చేయాలంటే ఏ డైరెక్టర్‌కైనా ఎదురుచూపులు తప్పవనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు తీరిక లేకుండా సినిమాలు ఉన్నాయి. మరి సుధా అంతకాలం ఎదురుచూస్తారా..? ఈ గ్యాప్‌లో వేరేవాళ్లతో మరో సినిమా పట్టాలెక్కిస్తారా? అన్నది త్వరలో తెలుస్తుంది. ఏదేమైనా ప్రభాస్‌తో సినిమా తీయనున్నట్లు వచ్చే వార్తలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే మరి. ఇదిలా ఉండగా.. ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణలో ఇన్నాళ్లు బిజీగా ఉంటూ వస్తున్నారు ప్రభాస్‌. కరోనా వల్ల చిత్రీకరణ వాయిదా పడటంతో ‘రాధేశ్యామ్‌’ కోసం సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘సలార్‌’లోని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని