కుంభమేళా నేటితో ముగింపు..? - lakhs ignore covid concerns to take holy dip in haridwar
close
Published : 14/04/2021 18:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుంభమేళా నేటితో ముగింపు..?

దిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఘనంగా సాగుతున్న కుంభమేళాను నేటితో ముగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఈ కుంభమేళా నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తడం, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మతపెద్దలతో చర్చించి తర్వాత నేటితో ముగించాలని భావిస్తున్నట్లు సమాచారం. 

సాధారణంగా మూడు నెలల పాటు కుంభమేళా జరిగేది. కానీ ఈ సారి కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా నెలరోజులే జరపాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ మొదటివారంలో కుంభమేళా ప్రారంభమవగా.. ఏప్రిల్‌ 12, 14వ తేదీల్లో షాహీ స్నాన్‌ను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం సమయానికి 9 నుంచి 10లక్షల మంది గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 

నాగసాధువులు, భక్తులతో హరిద్వార్‌ ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. అయితే ఓవైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ భక్తులెవరూ కనీసం మాస్క్‌లు ధరించడం లేదు. ఇక భౌతిక దూరం మాట సరేసరి. కుంభమేళాకు వచ్చేవారికి కొవిడ్‌ నెగెటివ్‌ పత్రం తప్పనిసరి చేసినప్పటికీ గత రెండు రోజులుగా హరిద్వార్‌లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది.

ఘాట్ల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించనివారికి జరిమానా వేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ రద్దీ దృష్ట్యా అది సాధ్యం కావడం లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కొవిడ్‌ ఉద్ధృతి సమయంలో కుంభమేళా నిర్వహించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుంభమేళాను నేటితో ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని