హైదరాబాద్: ‘పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం’ అంటున్నారు జగపతిబాబు. ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘లక్ష్య’. నాగశౌర్య కథానాయకుడు. ఆర్చరీ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో శౌర్య సాఫ్ట్, రఫ్ లుక్స్‌లో విభిన్నంగా కనిపించనున్నారు. శుక్రవారం నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ‘లక్ష్య’ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.
‘‘చాలా మందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ ఎవడో ఒక్కడు పుడతాడు. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు’ అంటూ టీజర్ ఆరంభంలో నాగశౌర్య పాత్రను ఉద్దేశిస్తూ జగపతిబాబు చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ టీజర్ ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సారి శౌర్యకు హిట్ పక్కా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయికగా సందడి చేయనున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ ప్రెజెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
రెండోసారి.. పంథా మారి
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
గుసగుసలు
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
కొత్త పాట గురూ
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’