Tokyo Olympics: 100 మీటర్ల పరుగు పందెంలో లామోంట్‌ సంచలనం - lamont marcell jacobs wins men 100m in huge shock
close
Updated : 01/08/2021 21:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: 100 మీటర్ల పరుగు పందెంలో లామోంట్‌ సంచలనం

టోక్యో: ఒలింపిక్స్‌లో సంచలనం. పరుగుల రారాజుగా పేరొందిన ఉసేన్‌ బోల్ట్‌కు కొత్త వారసుడొచ్చేశాడు. ప్రపంచంమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 100 మీటర్ల పరుగు పందెంలో ఎవరి ఊహకూ అందని రీతిలో ఇటలీకి చెందిన అథ్లెట్‌ లామోంట్‌ మార్సెల్‌ జాకబ్స్‌ విజయం సాధించాడు. కేవలం 9.80 సెకన్లలో అతడు గమ్యాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత అమెరికాకు చెందిన ఫ్రెడ్‌ కెర్లీ(9.84 సెకన్లు) రజతం, కెనడాకు చెందిన ఆండ్రీ డి గ్రాస్సే (9.89 సెకన్లు) కాంస్యం దక్కించుకున్నారు.

స్పింటర్‌.. లాంగ్‌ జంపర్‌

లామోంట్‌ మార్సెల్‌ జాకబ్స్‌ 1994 సెప్టెంబరు 24 అమెరికాలోని టెక్సాస్‌లో పుట్టాడు. అతడి తల్లి వివియానా ఇటలీకి చెందిన వారు. తండ్రి అమెరికన్‌. జాకబ్‌ తండ్రి యూఎస్‌ ఆర్మీలో పనిచేసేవారు. వృత్తి రిత్యా ఆయన సౌత్‌ కొరియాకు వెళ్లిపోయారు. దీంతో జాకబ్‌ను తీసుకుని ఆమె తల్లి వివియానా ఇటలీకి వచ్చేసింది. మార్సెల్‌కు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. అతను అథ్లెట్‌ కాకముందు పలు క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. స్విమ్మింగ్‌, బాస్కెట్‌ బాల్‌ కూడా ఆడేవాడు. ఫుట్‌బాల్‌ సాధన చేస్తున్న క్రమంలో స్కూల్‌ కోచ్‌ పిలిచి ‘నువ్వు చాలా వేగంగా ఉన్నావు. ఇంకేదైనా స్పోర్ట్స్‌లో ముఖ్యంగా అథ్లెట్‌ అయితే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారట. దీంతో మార్సెల్‌ లాంగ్‌ జంప్‌పై దృష్టి సారించాడు. అలా లాంగ్‌ జంప్‌లో శిక్షణ పొంది రాటు దేలాడు.

2018లో 100 మీటర్ల ట్రాక్‌పైకి..

2016లో ఇటాలియన్‌ ఛాంపియన్‌షిప్‌ జరగ్గా అందులో 7.89 మీటర్లు దూకి విజయం సాధించాడు. అయితే, 2018లో అనూహ్యంగా 100మీటర్ల ట్రాక్‌పైకి వచ్చిన జాకబ్‌ సాధన చేయడం మొదలు పెట్టాడు. ఈలోగా కరోనా రావడంతో ఇంటి వద్దే సాధన చేయాల్సి వచ్చింది. మళ్లీ 2021 సాధన మొదలు పెట్టిన జాకబ్స్‌ యూరోపియన్‌ ఇండోర్‌ ఛాంపియన్స్‌లో 60మీటర్ల పరుగు పందెంలో బంగారు  పతకం సాధించాడు. ఆ తర్వాత సవోనాలో 100మీటర్లను 9.95 సెకన్లలో చేరుకుని సరికొత్త ఇటాలియన్‌ రికార్డు నమోదు చేశాడు. తాజా ఒలింపిక్స్‌కు వచ్చే ముందు జాకబ్‌ మాట్లాడుతూ.. ‘టోక్యోలో మెడల్‌ సాధించటానికి వెళ్తున్నా. ఎందుకంటే బోల్ట్‌ లేడు. కోల్‌మెన్‌ కూడా లేడు. 100 మీటర్ల పరుగులో హాట్‌ఫేవరెట్‌ ఎవరో తెలియదు. ఇదొక యుద్ధం. నేను కలలు కనడం కొనసాగుతుంది’’ అని అన్నాడు.

టాటూస్‌ అంటే ఇష్టం

అంతేకాదు, జాకబ్‌కు టాటూస్‌ అంటే చాలా ఇష్టం. అతని శరీరంపై ‘ఫ్యామిలీ.. జీవితం ఎక్కడ పుట్టినా ప్రేమ అనేది అంతం లేనిది’, ‘పోరాటానికి ఒక కృత నిశ్చయం, జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకునే తత్వం కలిగి ఉండాలి. ఎవరైతే సాహసం చేస్తారో వాళ్లు ఓడిపోయినా ఒక గౌరవం, ధైర్యంతో కూడిన యోధులుగా సమాజం గుర్తిస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచం ధైర్యవంతులకే సొంతం’’ అని సందేశాలు ఉంటాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని