పాప్‌కార్న్‌: ఈ మూవీ అప్‌డేట్స్‌ చూశారా? - latest movie updates
close
Updated : 03/04/2021 21:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాప్‌కార్న్‌: ఈ మూవీ అప్‌డేట్స్‌ చూశారా?

* చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ కథానాయిక. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రంలోని ‘లాహే లాహే’ లిరికల్‌ వీడియో 10 మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. మణిశర్మ స్వరాలు సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. హారిక నారాయణ్‌, సాహితీ చాగంటి ఆలపించారు.

* అడవి శేష్‌ కీలక పాత్రలో శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మేజర్‌’. ఏప్రిల్‌ 12న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

* కార్తికేయ కథానాయకుడిగా శ్రీ సారిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాన్య రవిచంద్రన్‌ కథానాయిక. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం షూటింగ్‌ తిరిగి మొదలైనట్లు తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

* ‘బిచ్చగాడు’ లాంటి వైవిధ్య చిత్రాన్ని తెరకెక్కించిన శశి దర్శకత్వంలో సిద్ధార్థ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. దీనికి ‘ఒరేయ్‌ బామ్మర్ది’ అనే తెలుగు టైటిల్‌ను ఖరారు చేశారు.

* ఖమ్మంలో కొత్తగా ప్రారంభించిన ‘కేఎల్‌ఎం షాపింగ్‌ మాల్‌’ను యువ కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌, కథానాయిక కృతి శెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

* వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి, ప్రియమణి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’ ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా తీసిన ఫొటోను దర్శకుడు వేణు ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

* ప్రభాస్‌ కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బిల్లా’. అనుష్క, హన్సిక కథానాయికలు. ఈ సినిమా విడుదలై శనివారంతో 12ఏళ్లు పూర్తి చేసుకుంది.

* సందీప్‌ కిషన్‌ నటిస్తున్న ‘గల్లీరౌడీ’ ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వి.వి.వినాయక్‌, నందినీ రెడ్డి రానున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని