జక్కన్నతో మహేశ్‌ చిత్రం.. ఊహకందని స్క్రిప్ట్‌ రెడీ! - latest news about rajamouli and mahesh babu film
close
Updated : 10/02/2021 22:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జక్కన్నతో మహేశ్‌ చిత్రం.. ఊహకందని స్క్రిప్ట్‌ రెడీ!

ఇంటర్నెట్‌డెస్క్‌‌: రాజమౌళి- మహేష్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. గతేడాది ఓ ఇంటర్య్వూలో రాజమౌళినే ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ క్షణం నుంచే ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. నేపథ్యం ఏదైనా విజువల్‌ ఎఫెక్ట్స్‌తో తనదైన ముద్ర వేసే రాజమౌళి.. మహేష్‌ బాబుతో ఎలాంటి కథ తెరకెక్కించనున్నారనేది అందరి సందేహం. తాజాగా దానికి సమాధానం దొరికినట్టే అంటున్నాయి సినీ వర్గాలు. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ కథను రాస్తున్నారు. తండ్రీతనయులు ఈసారి డ్రామాల్ని పక్కన పెట్టి మహేష్‌ కోసం ఎవరూ ఊహించని స్ర్కిప్టును సిద్ధం చేస్తున్నారట.

అడవి నేపథ్యంలో సాగే భారీ బడ్జెట్‌ సినిమా అని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో పోరాట సన్నివేశాలు తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు భారతీయ చిత్రపరిశ్రమ చూడని ఫారెస్ట్‌ యాక్షన్‌ ఎడ్వెంచర్‌ అని టాక్‌. లాక్‌డౌన్‌ సమయంలో ఈ క్రేజీ ప్రాజెక్టుపై విజయేంద్ర ప్రసాద్‌, రాజమౌళి చాలా కసరత్తులు చేశారని, 2022లో సెట్స్‌పైకి వెళ్లనుందని ఆంగ్ల మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మహేష్‌ విషయానికొస్తే.. పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు.

ఇదీ చదవండి..

14న ‘రాధేశ్యామ్‌’ నుంచి ఏం రాబోతుంది?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని