వాళ్లందరూ సిగ్గు తెచ్చుకోవాలి: సురేఖ  - latest promo of alitho saradaga
close
Updated : 06/05/2021 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లందరూ సిగ్గు తెచ్చుకోవాలి: సురేఖ 

భావోద్వేగానికి లోనైన నటి

హైదరాబాద్‌: బుల్లితెర నటిగా కెరీర్‌ ఆరంభించి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి సురేఖా వాణి. తన నటన, కామెడీ టైమింగ్‌తో తెలుగువారికి చేరువైన సురేఖ తాజాగా తన స్నేహితురాలు, నటి రజితతో కలిసి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో తన జీవితానికి సంబంధించిన ఎన్నో షాకింగ్‌ విషయాలను ఆమె బయటపెట్టారు. అంతేకాకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సురేశ్‌ మృతి గురించి ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

‘‘కొన్ని అపార్థాలు, మనస్పర్థల కారణంగా మా అత్తింటి కుటుంబం మాకు దూరంగా ఉంటోంది. క్లిష్ట పరిస్థితుల్లో సైతం వాళ్లు మాకు ఒక్కరూపాయి కూడా సాయం చేయలేదు. నేను, నా కూతురే అన్ని సమకూర్చుకున్నాం. అయినప్పటికీ నన్ను, నా కూతుర్ని వాళ్లు ఎంతో నిందించారు. నా భర్త మృతి విషయంలో నాదే తప్పన్నట్లు చెప్పారు.  ఈ ప్రోగ్రామ్‌ చూశాకైనా..  నన్ను, నా కూతుర్ని అన్నందుకు వాళ్లు సిగ్గుతెచ్చుకోవాలి ’’ అని సురేఖ ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం తన భర్త మృతి గురించి మాట్లాడుతూ.. శరీరంలో రక్తం గడ్డ కట్టడంతో ఓ సర్జరీ జరిగిన నెల రోజులకే ఆయన  కన్నుమూశారని చెబుతూ సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు, ఓ వ్యక్తి కారణంగా రైలు ప్రయాణం చేయడానికి తాను ఇప్పటికీ ఎంతో భయపడుతున్నానని రజిత తెలిపారు. సురేఖ, రజిత చెప్పిన సరదాగా సంగతులు, విశేషాలు తెలుసుకోవాలంటే మే 10న ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ ఎపిసోడ్‌ చూడాల్సిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని