‘చావు కబురు చల్లగా’ అందరికి నచ్చుతుంది - lavanya tripathi chaavu kaburu challaga movie pressmeet
close
Published : 15/03/2021 23:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చావు కబురు చల్లగా’ అందరికి నచ్చుతుంది

హైదరాబాద్‌: ‘‘నాలోనూ సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది’’ అంటోంది కథానాయిక లావణ్య త్రిపాఠి. ఇటవల ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ మంచి విజయాన్ని తన ఖాతాల వేసుకుంది. తాజాగా కథానాయికగా కార్తికేయతో కలిసి నటిస్తోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పణలో వస్తున్న ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయిక లావణ్య త్రిపాఠి విలేకరుల సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

* ఈ సినిమా గురించి దర్శకుడు కౌశిక్‌ కొద్దిగా స్టోరీ చెప్పారు. ఆయన చెప్పిన విధానం, కథ నాకు బాగా నచ్చాయి. గీతా ఆర్ట్స్ అంటే విజయాలకు పెట్టింది పేరు. ఎంతోమందిని పరిచయం చేసింది. ఈ సినిమాలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.

* ఓ పెళ్లయిన అమ్మాయి విడో కావడం ఆ తర్వాత అమ్మాయిని బస్తీ బాలరాజు (కార్తికేయ) ప్రేమించడం అనేది భిన్నంగా ఉంటుంది. ఈ పాత్రకి నా నిజజీవితంలోని పాత్రకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో పాత్ర పేరు మల్లిక. వైజాగ్‌ అమ్మాయిగా కనిపించనున్నా.

* ఇదొక ఛాలెంజ్‌ పాత్ర. అమ్మాయి పాత్ర తన పరిధి దాటదు. ఈ పాత్ర నేను చేయాలనిపించింది. అందుకే చేస్తున్నా. కానీ, ఎలా ఉంటుందో చూడాలి. ఈ పాత్ర గురించి తెలుసుకోవడం కోసం చాలా వీడియోలు చూశాను. కొన్ని రియల్‌ పాత్రలను చూశాను.

* ‘అందాల రాక్షసి’ చిత్రంలో ఉన్నంత మేకప్‌ ఇందులో ఉండదు. నాది కామెడీ ఫేస్‌ కాదు. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడండి. భావోద్వేగ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. అంతేకాదు సినిమాలో హాస్యంతో పాటు సందేశం కూడా ఉంటుంది.

* ఇందులో నా పాత్రకి డబ్బింగ్‌ చెప్పమని అడిగారు. కా,నీ నాకు లాంగ్వేజ్‌ సమస్య. గీతా ఆర్ట్స్ అంటే ఓ కుటుంబంలాంటిది. అందరూ చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతారు. అందరిలోనూ నేను పాజిటివ్‌నే చూస్తాను. నాలో సెన్సాఫ్‌ హ్యూమర్‌ కొంచెం ఎక్కువే.

* కొత్త దర్శకులతో కలిసి పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. ‘చావు కబురు చల్లగా’ దర్శకుడు కూడా కొత్తవారే. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నా.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని