కమల్‌ సినిమాలో ప్రతినాయకుడిగా లారెన్స్‌? - lawrence opposite to kamal hasan
close
Published : 09/03/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమల్‌ సినిమాలో ప్రతినాయకుడిగా లారెన్స్‌?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌ హాసన్‌కి ప్రతినాయకుడిగా రాఘవ లారెన్స్‌ నటిస్తున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. కమల్‌ హీరోగా లోకేశ్‌ కనకరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్రమ్‌’. ఈ సినిమాలోని విలన్‌ పాత్ర వైవిధ్యంగా ఉండబోతుందని, దానికి లారెన్స్‌ అయితే న్యాయం చేయగలరని భావించిందట చిత్రబృందం. ఈ మేరకు లారెన్స్‌తో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ చిత్రంలో కమల్‌తో పోటీపడేందుకు లారెన్స్‌ సుముఖంగానే ఉన్నారని సమచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

డ్యాన్స్‌ మాస్టర్‌గానే కాకుండా దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేశారు లారెన్స్‌. హారర్‌ కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  మరి యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘విక్రమ్‌’లో విలన్‌గా ఎలా మెప్పిస్తారో చూడాలి. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. కథానాయకుడిగా కమల్‌కి 232వ చిత్రం. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం కమల్‌ చిత్రీకరణలో పాల్గొనే అవకాశాలున్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని