ఆరుబయట లోదుస్తులు ఆరేయడం.. అక్కడ చట్టవిరుద్ధం  - laws regarding undergarments in different countries
close
Published : 16/09/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరుబయట లోదుస్తులు ఆరేయడం.. అక్కడ చట్టవిరుద్ధం 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో ఉన్న ప్రతీ దేశానికి వివిధ చట్టాలు, న్యాయ వ్యవస్థలు ఉంటాయి. ఇక వేరే దేశాల్లో ఉన్న చట్టాలను మన దేశంతో పోల్చి చూస్తే... కొన్ని భయంకరంగా.. మరి కొన్ని ఆశ్చర్యంగా, విడ్డూరంగా అనిపిస్తాయి. అందుకు ఉదాహరణే.. లోదుస్తులకు సంబంధించి ఓ చట్టాలు ఉండటం. వినడానికి కాస్త ఫన్నీగా అనిపించినా ఇది మాత్రం నిజం. అమెరికాలోని మిన్నెసోటాలో పురుషులు, మహిళల లోదుస్తులును ఒకేతీగ మీద ఆరబెట్టడమనేది చట్టవిరుద్ధమట. అదే థాయ్‌లాండ్‌లో అండర్‌వేర్‌ ధరించకుండా ఎవరూ ఇంటి బయటకు రావడం కుదరదనే షరతు ఉంది. ఈ నియమ నిబంధనలను కనుక ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది థాయ్‌ ప్రభుత్వం. 

స్పానిష్‌లోని సెవిల్లె నగరంలో.. ఇక్కడి నివాసితులు లోదుస్తులు ఉతకడమే కాదు. ఆరుబయట ఆరేయకూడదనే నిబంధనా ఉంది. ఇక జపాన్‌లోని పలు ప్రదేశాల్లో మహిళలు లోదుస్తులు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. మార్కెట్‌లో ఎన్ని రకాల అండర్‌ గార్మెంట్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లేసీ కంపెనీ లోదుస్తులను రష్యా, బ్రసెల్స్‌, కజకిస్థాన్‌ దేశాలు నిషేధించాయట. 4శాతం కంటే తక్కువ ఉన్న కాటన్‌తో వీటిని తయారు చేయడమే ఇందుకు కారణం. మహిళల శరీర రక్షణ మేరకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వాలు 2013లో ఈ చట్టాలను అమలు చేశాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని