మిస్డ్‌ కాల్‌ ఇవ్వండి.. ఆక్సిజన్‌ ఇస్తా: సోనూ - lets save more lives oxygen concentrators on your way says sonusood
close
Published : 15/05/2021 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మిస్డ్‌ కాల్‌ ఇవ్వండి.. ఆక్సిజన్‌ ఇస్తా: సోనూ

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా జనాలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పుడు చాలామంది ఆక్సిజన్‌ దొరక్క ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి సమయంలో కేవలం ఒకే ఒక్క మిస్డ్‌ కాల్‌ ఇస్తే.. మీకు ఆక్సిజన్‌ ఇస్తా అంటున్నారు సోనూసూద్‌. కరోనా తెచ్చిన కష్టకాలంలో హీరోగా నిలబడి ఎందరినో ఆదుకుంటున్న ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరో అడుగు ముందుకేశారు. ఆక్సిజన్‌ కోసం ఎదురుచూస్తూ వాటిని కొనలేని పరిస్థితిలో ఉన్న వారికి ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌తో పాటు పలుదేశాల నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లకు ఆర్డర్లు ఇచ్చారు. దిల్లీలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ కావాల్సిన వాళ్లు తనను సంప్రదించాలని ఆయన అన్నారు.

‘దిల్లీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కువ సంఖ్యలో జనం కరోనాతో పోరాడుతున్నారు. అందులో చాలామందికి ఆక్సిజన్‌ అందించాల్సి ఉంది. అందుకే.. వారికి ఆక్సిజన్‌ అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ నంబర్‌కు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ అవసరం ఉన్నవాళ్లు ఈ నంబర్‌ (022-61403615)కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి రిజిస్టర్‌ చేసుకోవాలి. ఈ సేవలు పూర్తి ఉచితంగా అందిస్తాము’ అని సోనూ అన్నారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు వచ్చేస్తున్నాయి. దిల్లీలో మరిన్ని ప్రాణాలు కాపాడుకుందాం అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని