Vijay Deverakonda: రూ.200కోట్ల ఆఫర్‌.. చాలా తక్కువ - liger got a sensational offer for its direct ott
close
Updated : 22/06/2021 08:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijay Deverakonda: రూ.200కోట్ల ఆఫర్‌.. చాలా తక్కువ

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ యాక్షన్‌ చిత్రం ‘లైగర్‌’. ఈ పాన్‌ ఇండియా సినిమా ప్రకటించినప్పటి నుంచి రోజురోజుకూ విపరీతమైన అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా ఉద్ధృతితో చిత్రీకరణ నిలిచిపోగా.. ప్రస్తుతం తిరిగి సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పూరి జగన్నాథ్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రానికి ఓ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్‌ ఇచ్చిందట. థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలకు, అన్ని భాషల్లో శాటిలైట్‌ రైట్స్‌కు కలిపి రూ.200 కోట్లు ఆఫర్‌ చేసిందట. ఈ ఆఫర్‌పై విజయ్‌ దేవరకొండ ట్విటర్‌ ద్వారా స్పందించాడు. ఇది చాలా చిన్న మొత్తం.. ఇంతకంటే ఎక్కువ మొత్తం థియేటర్లో చూస్తారని పేర్కొన్నాడు విజయ్‌. తన ట్వీట్‌ ద్వారా ఈ వార్తలు ఖండించడమే కాకుండా థియేటర్లలోనే ‘లైగర్‌’ రిలీజ్‌ చేస్తారని చెప్పకనే చెప్పాడీ రౌడీ హీరో. ఇంతకీ ఆ విడుదలెప్పుడో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌ సరసన బాలీవుడ్‌ భామ అనన్యపాండే సందడి చేయనుంది. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీలకపాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని