ట్రెండింగ్‌లో ‘లైగర్‌’.. ఎందుకంటే? - liger release date update
close
Published : 10/02/2021 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రెండింగ్‌లో ‘లైగర్‌’.. ఎందుకంటే?

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది ‘లైగర్‌’. విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’ ఉపశీర్షిక. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. బాలీవుడ్‌ భామ అనన్య పాండే విజయ్‌ సరసన నటిస్తోంది. ఇంతకీ ఇప్పుడీ చిత్రం ట్రెండింగ్‌ అవడానికి కారణం ఏంటంటే.. ప్రస్తుతం తెలుగులో చిత్రీకరణ జరుపుకొన్న, జరుపుకొంటున్న సినిమాల విడుదల తేదీలను ఆయా చిత్ర బృందాలు ఇప్పటికే ప్రకటించేశాయి. అగ్ర హీరోల నుంచి అరంగ్రేటం చేయనున్న కథానాయకుల వరకూ మేం ఫలానా రోజున రాబోతున్నాం అని ముందే చెప్పేశారు. అయితే భారీ అంచనాల నడుమ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ లైగర్‌ రిలీజ్‌ డేట్‌ మాత్రం వెల్లడించలేదు చిత్రబృందం. తాజాగా ఆ శుభవార్తని రేపు (ఫిబ్రవరి 11) ఉదయం గం:8.14ని.లకు చెప్పబోతున్నామంటూ ట్విటర్‌ వేదికగా తెలియజేసింది. దీంతో ‘లైగర్‌’ హ్యాష్‌ ట్యాగ్‌ నంబరు 1గా నిలిచింది. ఈ చిత్రంలో బాక్సర్‌గా కనిపించనున్నాడు విజయ్‌.

ఇదీ చదవండి..

‘పుష్ప’ షూట్‌.. నాలుగు గంటలే నిద్ర: రష్మికAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని