బ్యాట్‌తో కాదు స్టంప్‌తో ఆడేస్తాడు బుడతడు - little kid practising cricket with one stump instead of bat viral video
close
Published : 08/05/2021 17:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాట్‌తో కాదు స్టంప్‌తో ఆడేస్తాడు బుడతడు

(Photo: Raju Devendran Linked in video screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: సహజంగా ఎవరైనా క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్‌తో బంతిని బాదేస్తారు. సరైన బంతులు ఎంపిక చేసుకొని బ్యాట్‌తో కచ్చితమైన షాట్లు దంచికొడతారు. అయితే, ఇందుకు భిన్నంగా ఇప్పుడొక బుడతడు ఆడుతున్న క్రికెట్‌ మాత్రం కాస్త కొత్తగా, ఆసక్తిగానూ ఉంది. ఎందుకంటే ఆ చిన్నారి బ్యాటింగ్ చేసింది, అన్ని రకాల షాట్లూ ఆడింది బ్యాట్‌తో కాదు. స్టంపింగ్‌ కోసం ఉపయోగించే వికెట్‌తో. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కేరళలోని త్రిసూర్‌కు చెందిన తొమ్మిదేళ్ల విగ్నాజ్‌ ప్రెజిత్‌కు క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. 2019 ఐపీఎల్‌ చూసినప్పటి నుంచి అతడికి ఆటపై ఇష్టం పెరిగింది. దాంతో అప్పటి నుంచీ రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేచి మూడు గంటలపాటు ప్రాక్టీస్‌ చేస్తాడు. తమ అపార్ట్‌మెంట్‌ మీదున్న టెర్రస్‌పైనే చుట్టూ నెట్స్‌ ఏర్పాటు చేసుకొని బ్యాటింగ్‌ సాధన చేస్తాడు. ఈ క్రమంలోనే ఇటీవల బ్యాట్‌తో కాకుండా కేవలం ఒక వికెట్‌తో బంతిని అన్ని వైపులా దంచికొట్టాడు. ఫ్లిక్‌షాట్‌, ర్యాంప్‌ షాట్‌, కవర్‌ డ్రైవ్, లెగ్‌సైడ్‌, ఆఫ్‌ సైడ్‌ నలుమూలలా ఒకే వికెట్‌తో బ్యాటింగ్‌ చేశాడు.

ఈ వీడియోను తొలుత రాజు దేవేంద్రన్‌ అనే ఓ వ్యక్తి లింక్‌డిన్‌లో పోస్టు చేశాడు. దానికి నెటిజెన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో అదిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి ఆడుతున్న షాట్లను చూసి ఎంతో మంది అభినందిస్తున్నారు. అయితే, ఆ చిన్నారి బ్యాట్స్‌మన్‌కు మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఎవరైనా సహాయం చేయాలని తండ్రి ప్రెజిత్‌ కోరుతున్నాడు. దీర్ఘకాలంలో మంచి శిక్షణ ఇప్పించగలిగితే విగ్నాజ్‌ భవిష్యత్‌లో గొప్ప క్రికెటర్‌ అవుతాడని ఆశిస్తున్నాడు. మీరూ ఒకసారి ఆ వీడియో చూసి ఆస్వాదించండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని