పుణె లాక్‌డౌన్‌పై ఏప్రిల్‌ 2 తర్వాతే నిర్ణయం: అజిత్‌   - lockdown in pune decision after april 2
close
Published : 26/03/2021 17:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుణె లాక్‌డౌన్‌పై ఏప్రిల్‌ 2 తర్వాతే నిర్ణయం: అజిత్‌ 

పుణె: కరోనా వైరస్‌ మరోసారి మహారాష్ట్రను కుదిపేస్తోంది. రోజురోజుకీ అక్కడ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలు నగరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్‌ అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో పుణె జిల్లా/ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా పరిస్థితిపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికైతే పుణెలో లాక్‌డౌన్‌ లేదన్నారు. మున్ముందు కేసులు ఇలాగే కొనసాగితే మాత్రం అప్పటి పరిస్థితిపై సమీక్షించి ఏప్రిల్‌ 2 తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

పుణెలో ఇప్పటివరకు 4,94,393 పాజిటివ్‌ కేసలు నమోదయ్యాయి. వీరిలో 4,35,859మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 8245మంది మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ 50240 క్రియాశీల కేసులు ఉన్నాయి.  రాష్ట్రంలో హోలీ వేడుకలపైనా కఠిన ఆంక్షలు విధించామన్నారు. ప్రజలు భౌతికదూరం పాటించి కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి లాక్‌డౌన్‌పై ప్రజాప్రతినిధుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అజిత్ పవార్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని