ఒంటరితనం వల్లే ఇంటర్నెట్‌ అతి వినియోగం! - lonelyness increased in teenagers amid pandamic leads online addiction
close
Updated : 03/03/2021 16:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒంటరితనం వల్లే ఇంటర్నెట్‌ అతి వినియోగం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటర్నెట్‌ వినియోగం అనేది ఇప్పుడు సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ వాడుతున్నారు. కానీ, ఇంటర్నెట్‌ అతి వినియోగం చాలా ప్రమాదకరమని, ఆరోగ్య సమస్యలతోపాటు అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే, ఒంటరితనాన్ని అనుభవించే కౌమరదశ పిల్లలకు ఇంటర్నెట్‌ వినియోగం ఒక వ్యసనంగా మారుతోందని ఓ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కౌమరదశ పిల్లలు.. ముఖ్యంగా పదహారేళ్ల వయసున్నవారు ఇంటర్నెట్‌కు బానిసలుగా మారుతున్నారని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కౌమర దశ పిల్లలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. బయట తిరగాలి.. స్నేహితులతో ఆడుకోవాలి.. ముచ్చటించాలి వంటి అనేక కోరికలు ఉంటాయి. కానీ, ఇటీవల కరోనా కాలంలో కాలేజీలు లేకపోవడం.. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాల్సి రావడంతో వారిలో ఒంటరితనం విపరీతంగా పెరిగిందట. దాన్ని దూరం చేసుకోవడం కోసం ఇంటర్నెట్‌ను అతిగా వాడటం మొదలుపెట్టారని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ పరిశోధకులు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా 16, 17, 18 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల ఇంటర్నెట్‌ వినియోగంపై అధ్యయనం చేశారు. వారిలో పదహారేళ్ల వయసు పిల్లలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతూ.. సోషల్‌మీడియా చూస్తూ సమయం గడుపుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. వారిలోని ఒంటరితనమే ఇంటర్నెట్‌పై మొగ్గుచూపేలా చేస్తోందని పేర్కొన్నారు. అయితే, వయసు పెరిగే కొద్దీ మానసిక ఎదుగుదల కారణంగా ఇంటర్నెట్‌ వినియోగంపై స్వీయ నియంత్రణ పాటిస్తున్నారని తెలిపారు.

అంతేకాదు.. ఇంటర్నెట్‌ అతివినియోగానికి డిప్రెషన్‌కు మధ్య సంబంధం ఉందని పరిశోధకులు వెల్లడించారు. డిప్రెషన్‌తో ఇంటర్నెట్‌ను ఎంతగా ఉపయోగిస్తున్నారో అంచనా వేయొచ్చని.. అలాగే ఇంటర్నెట్‌ అతి వినియోగం డిప్రెషన్‌ను మరింత పెంచుతుందని పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని