Spot fixing: స్పిన్నర్‌ అంకిత్‌ చవాన్‌పై ముగిసిన నిషేధం - looking forward to hit the ground ankeet chavan after being cleared to play
close
Published : 17/06/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Spot fixing: స్పిన్నర్‌ అంకిత్‌ చవాన్‌పై ముగిసిన నిషేధం

ముంబయి: దేశవాళీ క్రికెటర్‌ అంకిత్‌ చవాన్‌పై నిషేధం ముగిసింది. అతడు ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. నిషేధం ముగియడంతో మైదానానికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తున్నట్టు చవాన్‌ తెలిపాడు. కరోనా మహమ్మారి, వర్షాల కారణంగా వెళ్లలేకపోతున్నానని వెల్లడించాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2013లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో టీమ్‌ఇండియా క్రికెటర్‌ శ్రీశాంత్‌తో పాటు అంకిత్‌ చవాన్‌పై బీసీసీఐ శాశ్వత నిషేధం విధించింది. శ్రీశాంత్‌ వివిధ కోర్టుల చుట్టూ తిరిగి నిర్దోషినని నిరూపించుకొనే ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి కోర్టుల సూచనతో పాటు స్వయంగా విచారించిన అంబుడ్స్‌మన్‌ అతడిపై నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించారు. 2020, సెప్టెంబర్లోనే నిషేధం ముగిసింది. అంకిత్‌ సైతం శిక్షాకాలం అప్పుడే పూర్తిచేసుకున్నా ఉత్తర్వులు ఇవ్వలేదు. మంగళవారం రాత్రి అవి అందడంతో అతడు ఆనందం వ్యక్తం చేశాడు.

‘2020, సెప్టెంబర్‌కే నిషేధం ముగిసింది. నాకు లభించే ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటాను. వీలైనంత త్వరగా మైదానంలో అడుగుపెట్టాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. దురదృష్టవశాత్తు కొవిడ్‌, వర్షాల వల్ల మైదానాలు మూసేశారు. అయితే ఏ అవకాశం వచ్చినా వదలను’ అని అంకిత్‌ చవాన్‌ అన్నాడు. అతడు గతంలో టీమ్‌ఇండియాకు ఆడలేదు.

అంకిత్‌కు బీసీసీఐ తాత్కాలిక సీఈవో హేమంగ్‌ అమిన్‌ నుంచి ఈమెయిల్‌ అందింది. ‘బాంబే హైకోర్టు ఉత్తర్వుల మేరకు మీ నిషేధ ఆర్డర్‌ను బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ ముందు ఉంచాము. మీపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఆయన ఏడేళ్లకు తగ్గించారు. 2013, సెప్టెంబర్‌ 13 నుంచే ఇది వర్తిస్తుంది. 2020, సెప్టెంబర్‌13తో మీపై నిషేధం ముగిసింది’ అని అందులో వివరించారు. గతేడాది సెప్టెంబర్లోనే శిక్ష ముగిసినా బీసీసీఐ నుంచి క్లియరెన్స్‌ రాకపోవడంతో జోక్యం చేసుకోవాలని ముంబయి క్రికెట్‌ సంఘానికి అంకిత్‌ విజ్ఞప్తి చేయడం గమనార్హం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని