Maskతో శ్రీరామరక్ష - lord hanuman wear mask villagers motto of provide awareness on coronavirus at korutla
close
Published : 23/04/2021 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maskతో శ్రీరామరక్ష

కోరుట్ల: భయాల నుంచి రక్షణ ఇస్తాడు అభయాంజనేయుడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇప్పుడు అవగాహన కూడా కల్పిస్తున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌లో మాస్కు ధరించిన హనుమంతుడు దర్శనమిస్తున్నాడు. కరోనా నుంచి కాపాడుకోవడానికి మాస్కే శ్రీరామ రక్ష అంటూ ప్రజలకు బోధిస్తున్నాడు. 

అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఐలాపూర్‌ వాసులు గతంలో ఏర్పాట్లు చేశారు. కరోనా కేసులు పెరుగడంతో ప్రతిష్ఠాపన నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆంజనేయస్వామి విగ్రహానికి గ్రామస్థులు మాస్కు కట్టారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో మాస్కు ధరించడం పట్ల అవగాహన కలుగుతుందని వారు పేర్కొన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని