రుచి.. వాసన తిరిగి రావాలంటే ఏడాది ఆగాల్సిందే! - loss of smell and taste will recover with in one year
close
Published : 28/06/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రుచి.. వాసన తిరిగి రావాలంటే ఏడాది ఆగాల్సిందే!

పరిశోధనలో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సోకిన వారిలో కొంతమంది వాసన, రుచి కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వారు భయపడాల్సిన పనేం లేదని వైద్యులు చెబుతున్నారు. సమస్య తీవ్రమైతే తప్ప చికిత్స అవసరముండదని అంటున్నారు. ఇది బాధితులకు కొంత ఉపశమనం కలిగించే విషయమే అయినా.. కోల్పోయిన వాసన, రుచి ఘ్రాణశక్తి తిరిగి ఎప్పుడు వస్తోందో వైద్యులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే.. వాసన, రుచి కోల్పోయిన బాధితులు తిరిగి ఘ్రాణశక్తి పొందడానికి ఏడాది సమయం పడుతుందని ఓ పరిశోధనలో తేలింది. ఈ మేరకు జామా నెట్‌వర్క్‌ ఓపెన్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన కథనం ప్రచురితమైంది.

పరిశోధనలో భాగంగా కరోనా కారణంగా వాసన, రుచి కోల్పోయిన 97 మందిపై పరిశోధకులు ఏడాదిపాటు అధ్యయనం చేశారు. 97 మందిలో 51 మందిని ప్రతి నాలుగు నెలలకోసారి వాసన, రుచి ఘ్రాణశక్తి తిరిగొచ్చిందో లేదో పరీక్షించుకొని నివేదిక ఇవ్వాలని కోరారు. ఎనిమిది నెలలు గడిచేసరికి స్వీయపరీక్షలు చేసుకున్న 51 మందిలో 49 మందికి ఘ్రాణశక్తి పూర్తిగా తిరిగొచ్చింది. మిగతా ఇద్దరిలో ఒకరికి పాక్షికంగా ఘ్రాణశక్తి రాగా.. మరో వ్యక్తిలో ఎలాంటి పురోగతి లేదు. మిగిలిన 46 మందికి ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. సరిగ్గా ఏడాది పూర్తికాగానే ఈ 46 మందిని పరీక్షించగా.. వారికి వాసన, రుచి ఘ్రాణశక్తి పూర్తిగా తిరిగొచ్చిందట. దీన్ని బట్టి.. వాసన, రుచి ఘ్రాణశక్తి కోల్పోయిన కరోనా బాధితులు దానిని తిరిగి పొందడానికి ఏడాది సమయం పడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని