మహేశ్‌ రిలీజ్‌ చేసిన ‘ఏవో ఏవో కలలే’! - love story movie lyrical song
close
Published : 25/03/2021 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ రిలీజ్‌ చేసిన ‘ఏవో ఏవో కలలే’!

హైదరాబాద్‌: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని ‘ఏవో ఏవో కలలే’అంటూ సాగుతున్న లిరికల్‌ వీడియో సాంగ్‌ను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు విడుదల చేశారు. భాస్కర్‌ భట్ల రచించిన ఈ గీతాన్ని జోనితా గాంథీ, నకుల్‌ అభ్యంకర్‌ ఆలపించారు. పవన్‌ సీహెచ్‌ స్వరాలు సమకూర్చారు. శేఖర్‌ వీజే కొరియోగ్రఫీలో నాగచైతన్య, సాయిపల్లవి అదిరిపోయే స్టెప్పులతో అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని ‘సారంగదరియా’పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ ‘లవ్‌స్టోరీ’ని థియేటర్లలో ఏప్రిల్‌ 16న విడుదల చేయనున్నారు. మరి లేటెందుకు మీరు ఆ వీడియోను చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని