ఆకట్టుకుంటున్న ‘అర్ధశతాబ్దం’ లిరికల్‌ సాంగ్‌  - lyrical song video ‘merisaley’ from ardhashathabdam
close
Published : 05/06/2021 18:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆకట్టుకుంటున్న ‘అర్ధశతాబ్దం’ లిరికల్‌ సాంగ్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్: కార్తీక్‌రత్నం, నవీన్‌ చంద్ర, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ ప్రేమకథా చిత్రం ‘అర్ధశతాబ్దం’. సాయికుమార్‌, శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రలు పోషించారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించారు. సినిమా ఈ నెల 11న ఓటీటీ వేదిక ‘ఆహా’లో విడుదల కానుంది. తాజాగా సినిమాకి సంబంధించి ‘అరె మెరిసెలే.. మెరిసెలే.. మిలమిల మెరిసెలే’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పాటకి రహ్మన్‌ సాహిత్యం అందించగా, శంకర్‌ మహదేవన్‌ శ్రావ్యంగా ఆలపించారు. నవ్‌ఫాల్ రాజా ఎఐఎస్ సంగీతం సమకూర్చారు. చిత్రంలో ఆమని, పవిత్ర లోకేష్‌, రామరాజు, రాజా రవీంద్ర, అజయ్, సుహాస్‌, శరణ్య తదితరులు నటించారు. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ కలిసి నిర్మించారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని