కన్నీళ్లు పెట్టుకున్న లిరిసిస్ట్ స నా రే‌..! - lyrist gets emotional at chavu kaburu challaga event
close
Published : 10/03/2021 11:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కన్నీళ్లు పెట్టుకున్న లిరిసిస్ట్ స నా రే‌..!

హైదరాబాద్‌: తన జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలను ఆధారంగా చేసుకుని ‘పైన పటారం లోన లొటారం’ పాట రాశానని పాటల రచయిత సత్యనారాయణ రెడ్డి(సనారె) అన్నారు. కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. లావణ్య త్రిపాఠి కథానాయిక. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లుఅర్జున్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈవెంట్‌లో భాగంగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి  సనారే వివరించారు.

‘‘చావు కబురు చల్లగా’ చిత్రంలో నేను కొన్ని పాటలు రాశాను. నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. వాటి నుంచి ప్రేరణ పొంది ‘పైన పటారం, లోన లొటారం’ అనే పాట రచించాను. సమాజంలో మనుషుల ఆలోచనా విధానం ఎంతో మారింది. డబ్బు ఉంటేనే మనిషికి గుర్తింపు ఉంటుంది. డబ్బు లేకపోతే అస్సలు అతన్ని గుర్తించరు. మా నాన్న ఉన్నప్పుడు అందరూ మాతో  చక్కగా ఉన్నారు. కానీ, మా నాన్న మృతి చెందిన తర్వాత ఏ ఒక్కరూ మా వైపు చూడలేదు. మమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. అలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం అనుకోకుండా దొరికింది. నేను రాసిన పాటల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని చెబుతూ సనారె భావోద్వేగానికి గురయ్యారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని