మధ్యప్రదేశ్‌లో ఆ నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్‌ - madhya pradesh imposes lockdown in parts of 4 districts
close
Published : 02/04/2021 20:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధ్యప్రదేశ్‌లో ఆ నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్‌

భోపాల్‌: దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ఉద్ధృతి అధికంగా ఉన్న నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు చింద్వారా, రాట్లమ్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొత్తగా బెటుల్‌, ఖార్గాన్‌ జిల్లాల్లో శుక్రవారం నుంచి లాక్‌డౌన్‌ విధించాలని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా  సీనియర్‌ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఈ నాలుగు జిల్లాలకు గతంలో పంపారు. దీంతో అక్కడి కొవిడ్ పరిస్థితిని పర్యవేక్షించిన అనంతరం స్పెషల్ టీమ్స్‌ నివేదిక అందించాయి. దీంతో  వైరస్ వ్యాప్తి అధికమయ్యే అవకాశాలున్న ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,546 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,98,057కి చేరిందని ప్రభుత్వం వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని