కరోనా ఉద్ధృతి: మధ్యప్రదేశ్‌లోనూ లాక్‌డౌన్‌ - madhya pradesh imposes weekend lockdown
close
Published : 08/04/2021 13:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఉద్ధృతి: మధ్యప్రదేశ్‌లోనూ లాక్‌డౌన్‌

భోపాల్‌: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు మరోసారి ఆంక్షల బాటపట్టాయి. తాజాగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా వారాంతపు లాక్‌డౌన్‌ విధించింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ప్రకటించారు. కొన్ని నగరాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని సీఎం అన్నారు. ఆ ప్రాంతాల్లో ఆంక్షలపై సంక్షోభ నిర్వహణ బృందంతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పెద్ద నగరాల్లో కంటెయిన్‌మెంట్‌ జోన్లను పెంచుతున్నట్లు చెప్పారు.

మధ్యప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో అక్కడ నాలుగు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3.18లక్షలు దాటింది. ప్రధాన నగరాలైన ఇండోర్‌, భూపాల్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో అధికశాతం ఈ రెండు నగరాల్లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో శివరాజ్‌ సింగ్‌ సర్కార్‌ వారాంతపు లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4వేల మందికి పైగా వైరస్‌కు బలయ్యారు. 2.88లక్షల మంది కరోనాను జయించారు. 

కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ క్రమక్రమంగా ఆంక్షల చట్రంలోకి జారుకుంటోంది. ఇప్పటికే వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న మహరాష్ట్రలో వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రికర్ఫ్యూ విధించగా.. గుజరాత్‌, దిల్లీ కూడా కర్ఫ్యూ నిర్ణయం తీసుకుంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని