Nithiin: ‘మాస్ట్రో’ వచ్చేస్తున్నాడోచ్‌..! - maestro songs will release from nxt week
close
Published : 10/07/2021 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nithiin: ‘మాస్ట్రో’ వచ్చేస్తున్నాడోచ్‌..!

హైదరాబాద్‌: అంధుడి పాత్రలో నితిన్‌ నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మాస్ట్రో’. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అంధాదున్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని పాటలను వచ్చేవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘మాస్ట్రో’ సినిమా సరికొత్త పోస్టర్‌ని అభిమానులతో పంచుకున్న టీమ్‌.. మ్యూజికల్‌ ఫీస్ట్‌ కోసం సిద్ధంగా ఉండమని తెలిపింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా నభానటేశ్‌ సందడి చేయనున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ‘మాస్ట్రో’ చిత్రాన్ని నిర్మించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని