‘మగువా మగువా’ ఫిమేల్‌ వెర్షన్‌ వచ్చేసింది  - maguva maguva female version
close
Published : 16/04/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మగువా మగువా’ ఫిమేల్‌ వెర్షన్‌ వచ్చేసింది 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళల గొప్పతనాన్ని చాటి చెప్పిన గీతాల్లో ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ’ ఒకటి. సిధ్‌ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలోనిదీ గీతం. ఈ సినిమా ఇటీవలే విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోన్న నేపథ్యంలో ‘మగువా మగువా’ ఫిమేల్‌ వెర్షన్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు.. నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు.. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువ’ అంటూ శ్రోతల హృదయాల్ని హత్తుకుంటోంది ఈ గీతం. మోహన భోగరాజు ఆలపించగా తమన్‌ స్వరాలు సమకూర్చారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

హిందీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రుతి హాసన్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించారు. బోనీ కపూర్‌ సమర్పకులుగా వ్యవహరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని