మరిన్ని ఆంక్షల దిశగా మహారాష్ట్ర? - maha cm to hold all-party meet on saturday to discuss covid-19
close
Published : 10/04/2021 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరిన్ని ఆంక్షల దిశగా మహారాష్ట్ర?

ముంబయి: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది. 24 గంటల వ్యవధిలో అక్కడ దాదాపు 60వేల కొత్త కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన మహా సర్కారు ఇప్పటికే వారాంతపు లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా మరిన్ని ఆంక్షలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేడు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. నేడు జరగబోయే ఈ భేటీలో కొవిడ్‌ పరిస్థితులపై ఇతర పార్టీల నేతలతో సీఎం చర్చించనున్నారు. సమావేశం అనంతరం సీఎం పలు నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. వార్షిక పరీక్షల వాయిదా, చిన్న వ్యాపారులకు ఆర్థిక సహకారంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

నిర్మానుష్యంగా ముంబయి వీధులు

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా ఠాక్రే ప్రభుత్వం విధించిన వారాంతపు లాక్‌డౌన్‌ శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో శనివారం ఉదయం ముంబయి సహా పలు నగరాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రద్దీ ప్రాంతాలైన బృహన్ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టర్మినస్‌ సమీపంలోని వీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల వరకు ఈ లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది. ప్రస్తుతం ముంబయి మహానగరం గతేడాది మార్చి నాటి పరిస్థితులను తలపిస్తుండటం గమనార్హం.

కరోనాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మృతి

మహమ్మారి కారణంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. నాందేడ్‌ జిల్లాలోని డెగ్లూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రావుసాహెబ్‌ అంతపుర్కర్‌ మార్చి 19న కరోనా బారినపడ్డారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మార్చి 22న బాంబే ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయనకు కరోనా నెగెటివ్‌ వచ్చినప్పటికీ మల్టీఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో ఐసీయూలోనే ఉన్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి కన్నుమూశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని